Banda Prakash : బండ ప్రకాష్ రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు
మూడు రోజులక్రితం తెలంగాణ రాజ్యసభ సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిసిన ప్రకాష్.. తన రాజీనామా లేఖను అందచేశారు. కాగా ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.

Banda Prakash
Banda Prakash : రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ రాజీనామా చేశారు. మూడు రోజులక్రితం తెలంగాణ రాజ్యసభ సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిసిన ప్రకాష్.. తన రాజీనామా లేఖను అందచేశారు. కాగా ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.
చదవండి : TRS Candidates : ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
కాగా బండ ప్రకాష్ తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా కావడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాష్. కాగా ఈయన 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడేళ్ళ పదవి కాలం మిగిలి ఉండగానే ప్రకాష్ రాజీనామా చేశారు.
చదవండి : TRS MLC Candidates : ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు!