Ramoji Rao : రేపు ఉదయం ఫిలింసిటీలో ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి

Ramoji Rao Passed Away
Ramoji Rao Passed Away : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, పవన్ కల్యాణ్, వెంకయ్య నాయుడుతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read : రామోజీరావు మృతికి వైస్ జగన్, షర్మిల సంతాపం.. ట్విటర్ లో ఆసక్తికర ఫొటో ..
రామోజీరావు పార్ధివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం వద్దకు తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకొని రామోజీరావు పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. రామోజీతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోఉన్న సీఎం రేవంత్ రెడ్డి రామోజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.