రామోజీరావు మృతికి వైస్ జగన్, షర్మిల సంతాపం.. ట్విటర్ లో ఆసక్తికర ఫొటో ..
రామోజీరావు మృతికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ ఖాతాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.

Ramoji Rao Passed Away
Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈనెల 5న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు పార్థీవ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఇదిలాఉంటే.. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు ఆదేశాలు ఇచ్చారు.
Also Read : రామోజీరావుకు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా?
రామోజీరావు మృతికి రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామోజీరావు మృతికి సంతాపం తెలియజేశారు. జగన్ ట్వీట్ ప్రకారం.. ‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జగన్ ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
Also Read : Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత
రామోజీరావు మృతికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపాన్ని తెలియజేశారు. షర్మిల ట్వీట్ ప్రకారం.. ‘అక్షర యోధులు, అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు అందుకుని, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన విశిష్టమైన వ్యక్తి రామోజీ రావుగారి మరణం అత్యంత విషాదకరం. అయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అంటూ షర్మిల సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. తన తండ్రి, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రామోజీరావు కలిసిఉన్న ఫొటోను షేర్ చేశారు.
అక్షర యోధులు, అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు అందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన విశిష్టమైన వ్యక్తి, శ్రీ రామోజీ రావు గారి మరణం అత్యంత విషాదకరం. అయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/OBjHNggPIP
— YS Sharmila (@realyssharmila) June 8, 2024
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024