Renuka Chowdhury : ప్రధాని, కేంద్రమంత్రిపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

ప్రధాని రాహుల్ గాంధీకి భయపడుతున్నారని తెలిపారు. నిజాలు బయట పడుతున్నాయని రాహుల్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.

Renuka Chowdhury : ప్రధాని, కేంద్రమంత్రిపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Updated On : March 31, 2023 / 3:14 PM IST

Renuka Chowdhury : ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు యూజ్ లెస్ ఫెలో, లుచ్చా గాడు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై మోదీ చేసిన వాఖ్యలపై లీగల్ గా వెళ్ళే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. యూ హావ్ నో హార్ట్ మిస్టర్ మోదీ.. అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటో త్వరలోనే తెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ వాస్తవాలేనని అన్నారు.  రాహుల్ అడిగే వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షారుఖ్ ఖాన్ ముస్లిం కాబట్టే ఆయన కొడుకుపై డ్రగ్స్ అభాండాలు వేసి అదాని విషయాలు పక్కతోవ పెట్టించారని విమర్శించారు. అదాని, మోదీ సంబంధాలపై రాహుల్ ప్రశ్నించగానే ఆయన్ని టార్గెట్ చేశారని పేర్కొన్నారు.

Renuka Chowdhury : నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు.. దేశాన్ని ఉద్ధరిస్తారా?- రేణుకాచౌదరి

ప్రధాని రాహుల్ గాంధీకి భయపడుతున్నారని తెలిపారు. నిజాలు బయట పడుతున్నాయని రాహుల్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఫైనాన్షియల్ టైమ్స్ పై పరువునష్టం దావా వేయొచ్చు కదా అని ప్రశ్నించారు. మోదీ భారతదేశ కంఠాన్ని నొక్కుతున్నారని వెల్లడించారు.

రాహుల్ అడిగిన ప్రశ్నలనే రేణుక చౌదరిగా తాను అడుగుతున్నానని చెప్పారు. కేసులు పెట్టినంత మాత్రానా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమకు ఎవరూ సర్టిఫికెట్లు Renuka Chaudharyఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మోదీని ప్రధాని అనడానికి సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. 56 ఇంచుల చెస్ట్ ఉన్న మనిషికి 70 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

Renuka Chowdhury : ఖమ్మం, గుడివాడ.. రెండు చోట్లా పోటీ చేస్తా- మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీలేవరు ఓబీసీలు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీకి వ్యతిరేకం కాదని చెప్పారు. డ్రెస్సులు మార్చుకునే వాళ్ళకి దేశభక్తి గురించి ఏం తెలుస్తుందని విమర్శించారు. రాజ్యాంగ విలువలు తెలియని వాళ్ళు కొత్త పార్లమెంట్ భవనాలు కట్టి ఏం లాభమని నిలదీశారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ బలోపేతానికి కాదని స్పష్టం చేశారు.