Renuka Chowdhury : నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు.. దేశాన్ని ఉద్ధరిస్తారా?-రేణుకాచౌదరి

ముఖ్యమంత్రి మాటలకు జీఎస్టీ లేదు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ గౌరవం అంటే కేవలం కవితకేనా? భూ నిర్వాసితుల్లో ఆడవాళ్లు తెలంగాణ గౌరవం కాదా..? భూ నిర్వాసితుల బతుకులు కవిత కంటే తక్కువ. నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు దేశాన్ని ఉద్ధరిస్తారా?(Renuka Chowdhury)

Renuka Chowdhury : నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు.. దేశాన్ని ఉద్ధరిస్తారా?-రేణుకాచౌదరి

Renuka Chowdhury : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం గురించి తనకు నాలుగేళ్లుగా తెలుసన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తాను కూడా ఎదురు చూస్తూనే వచ్చానన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు తమకు రావాల్సిన ప్యాకేజీలు ఎక్కువగా కావాలని అడిగినందుకు పోలీసు బలగాలతో ఊరు ఖాళీ చేయించారని ఆమె ఆరోపించారు.

బాధితులకు చిన్న రూము, కిచెన్, బాత్రూం ఎటువంటి మెటీరియల్ వాడారో తెలియదన్నారు. వర్షా కాలంలో రేకుల షెడ్ లో ఉన్న వారికి దుర్భర పరిస్థితి ఎుదరైందని వాపోయారు. బాధితులకు ప్రాణ గండం ఉందని తెలిసి కూడా మళ్లీ ఓటు వేసి గెలిపిస్తారా? అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన ఇంటి వాస్తు కోసం ఇంటి ఎదురుగా ప్రాజెక్ట్ నిర్మించుకున్నారని ఆమె ఆరోపించారు.(Renuka Chowdhury)

Also Read..Telangana : కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోదీ సమన్లు : కేటీఆర్

వాస్తు పిచ్చితో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారని రేణుకా చౌదరి అన్నారు. బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో రావాల్సిన నిధులు సరిగ్గా కేటాయించలేదన్నారు. ముంపు గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా కేటాయించలేదన్నారు. ఆడవాళ్ళపై అసూయ చూపినందుకే మీ ఇంటి ఆడవాళ్ళపై మద్యం కేసు రూపంలో పాపం చుట్టుకుందని రేణుకాచౌదరి అన్నారు. Rఅండ్R బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎడారిలో పాఠశాలలు నిర్మించి ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు.(Renuka Chowdhury)

Also Read..Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

” మీరిచ్చిన మాట మీ ఆస్తిలో వాటా కాదు వారికి కేటాయించాల్సింది. వారికి న్యాయం చేయడం రాజ్యాంగంలో హక్కు. నీ వల్ల బాధితులకు ఎక్కడా న్యాయం జరగలేదు. ఇల్లు ఉన్నవారికి మళ్ళీ ఎందుకు వచ్చాయి.? ముఖ్యమంత్రి మాటలకు జీఎస్టీ లేదు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ గౌరవం అంటే కేవలం కవితకేనా? భూ నిర్వాసితుల్లో ఆడవాళ్లు తెలంగాణ గౌరవం కాదా..? భూ నిర్వాసితుల బతుకులు కవిత కంటే తక్కువ. నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు దేశాన్ని ఉద్ధరిస్తారా? కొండపోచమ్మ ప్రాజెక్టు భూనిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం పూర్తిగా చెల్లించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ లోనే ధర్నాకు దిగుతాం” అని రేణుకా చౌదరి హెచ్చరించారు.(Renuka Chowdhury)

Also Read..Kavitha Protest In Delhi: కవితకు పోటాపోటీగా.. హైదరాబాద్, ఢిల్లీలో బీజేపీ దీక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో

సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారంలో కొండపోచమ్మ ముంపు గ్రామాల ప్రజలతో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి మాట్లాడారు. వారి కష్టాలు, బాధలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.(Renuka Chowdhury)

Also Read..Andhra Pradesh : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో హీటెక్కుతున్న రాజకీయం .. టీడీపీ ట్రిక్సేంటీ? జనసేన జోరెంత? వైసీపీ వైఖరేంటీ..?