Andhra Pradesh : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో హీటెక్కుతున్న రాజకీయం .. టీడీపీ ట్రిక్సేంటీ? జనసేన జోరెంత? వైసీపీ వైఖరేంటీ..?

Andhra Pradesh : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో హీటెక్కుతున్న రాజకీయం .. టీడీపీ ట్రిక్సేంటీ? జనసేన జోరెంత? వైసీపీ వైఖరేంటీ..?

What are the strategies of the parties in Palnadu district Andhra Pradesh

Andhra Pradesh : పల్నాడు.. పౌరుషాల పురిటిగడ్డ. గత ఎన్నికల్లో.. నరసరావుపేట పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలను.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మరి.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా? అదే.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఇక్కడి రాజకీయం కాస్తా వేడెక్కుతోంది. బాగా పట్టున్న పల్నాడులో.. టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరి.. రాబోయే ఎన్నికల కోసం పసుపుదళం ఎలాంటి వ్యూహాలు రెడీ చేస్తోంది? అభ్యర్థులు మారే అవకాశం ఏమైనా ఉందా? కొత్త క్యాండిడేట్లు.. బరిలోకి దిగబోతున్నారా?

నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో.. 2019 ఎన్నికల్లో తొలిసారి వైసీపీ గెలిచింది. గెలవడమే కాదు.. దాని పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ విక్టరీ.. స్టేట్ మొత్తం రీసౌండ్ వచ్చింది. ఇటీవలే.. నరసరావుపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రాంతం.. పల్నాడు జిల్లాగా మారింది. ఇందులో.. ఏడు నియోజకవర్గాలుంటే.. అందులో ఐదింటిలో టీడీపీ అభ్యర్థులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. వాళ్లే.. పల్నాడు జిల్లాను శాసిస్తూ ఉంటారు. అయినప్పటికీ.. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌ను తట్టుకోలేకపోయారు. ప్రస్తుతం.. పల్నాడులో జనసేన బలం పుంజుకుంటోంది. ఇక.. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంతో.. కొత్త ఈక్వేషన్స్ మొదలయ్యాయ్.

నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండేది. 1952లో ఈ లోక్‌సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి.. ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 2009, 2014లో మాత్రం టీడీపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. గత ఎన్నికల్లో.. వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక.. ఇదే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఓడిన రాయపాటి సాంబశివరావుకు.. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. ఆయన తన వారసుడిని పాలిటిక్స్‌లోకి దించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టీడీపీ తరఫున పుట్టా సుధాకర్ యాదవ్.. ఎంపీగా పోటీ చేస్తారని.. టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరడంతో.. ఈక్వేషన్స్ మారుతున్నాయ్. ఈ స్థానం నుంచే.. ఆయన కుమారుడు.. కన్నా ఫణీంద్ర పోటీ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైసీపీ నుంచి ఈసారి ఎవరిని ఎంపీగా బరిలోకి దించుతారన్న దానిపై.. కాస్త సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే.. సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. అవి.. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల. ముందుగా.. చిలకలూరిపేట విషయానికొస్తే.. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి, మంత్రి విడదల రజినీకి అస్సలు పొసగడం లేదు. పైగా.. ఎమ్మెల్యే రజినీ.. కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు.. అందుబాటులో ఉండరనే టాక్ కూడా ఉంది. మరోవైపు.. ఎంపీ శ్రీకృష్ణ చిలకలూరిపేట నుంచే పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. వీళ్లిద్దరిలో వైసీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇక.. టీడీపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు.. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయ్. ఆయన అనుచరగణం కూడా కనుమరుగైపోయింది. వ్యాపారాల మీద ఫోకస్ పెట్టడంతో.. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈసారి.. ఆయనకు టికెట్ వచ్చే చాన్స్ లేదని.. పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వారికే టికెట్లు ఇస్తామని చెప్పడంతో.. ఈసారి పుల్లారావు పోటీపై సందేహాలు నెలకొన్నాయ్. విడదల రజినీని ఎదుర్కోవాలంటే.. బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని.. తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

పెదకూరపాడులో.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నంబూరు శంకర్ రావు ఉన్నారు. ఆయన అభివృద్ధి చేసినా.. ప్రజలకు అందుబాటులో ఉండరనే టాక్ ఉంది. వారంలో.. రెండు రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉంటారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. వైసీపీ నుంచి మళ్లీ ఆయనకు టికెట్ దక్కుతుందా.. లేదా.. అనేది ఆసక్తిగా మారింది. టీడీపీలో కన్నా చేరికతో.. తెలుగుదేశం వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే.. కన్నా అనుచరులంతా.. తెలుగుదేశంలో చేరిపోయారు. గత ఎన్నికల్లో ఓడిన కొమ్మాలపాటి శ్రీధర్‌పై.. క్యాడర్ కాస్త అసంతృప్తితోనే ఉంది. ఈసారి.. తెలుగుదేశం కొత్త అభ్యర్థిని పెడుతుందని.. నాయకుల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థిని మారిస్తేనే.. ప్రజులు ఆదరిస్తారని చెబుతున్నారు. టీడీపీ-జనసేన మధ్య గనక పొత్తు కుదిరితే.. పెదకూరపాడులో.. తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

సత్తెనపల్లి విషయానికొస్తే.. ముందు నుంచి తెలుగుదేశం ప్రాబల్యం ఎక్కువగా ఉండే సెగ్మెంట్ ఇది. ప్రస్తుతం.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన.. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండరనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో.. ఆయనపై అసమ్మతి రాగం కూడా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌పై అంబటి చేస్తున్న విమర్శలు.. కాపులకు మింగుడుపడటం లేదు. సత్తెనపల్లి వైసీపీ టికెట్ అంబటికే ఇచ్చినా.. గెలుపోటములను నిర్ణయించేది కాపులే కావడంతో.. ఈసారి అంబటి విషయంలో వాళ్లు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక.. మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత.. సత్తెనపల్లిలో టీడీపీ రెండు ముక్కలైంది. కోడెల తనయుడు శివరాం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి టికెట్ రేసులో కోడెల శివరాంతో పాటు వైవీ ఆంజనేయులు ఉన్నారు. ఇక్కడ.. కన్నాకు సంబంధించిన క్యాడర్ కాస్త ఎక్కువే ఉంది. అది.. ఈసారి టీడీపీ కొంత ప్లస్ అయ్యే చాన్స్ ఉందంటున్నారు. జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. సత్తెనపల్లిలో జనసేన అభ్యర్థినే బరిలోకి దించుతారనే టాక్ వినిపిస్తోంది.