Hyderabad Firing : హైదరాబాద్ మదీనాగూడలో ఆగంతకులు కాల్పులు.. రెస్టారెంట్ మేనేజర్ మృతి

మృతుడు దేవేందర్ గాయాన్ కలకత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 నెలల నుండి హోటల్ లో దేవేందర్ జనరల్ మేనేజర్ పని చేస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Hyderabad Firing : హైదరాబాద్ మదీనాగూడలో ఆగంతకులు కాల్పులు.. రెస్టారెంట్ మేనేజర్ మృతి

firing in Hyderabad

Updated On : August 24, 2023 / 11:30 AM IST

Hyderabad Firing One Killed : హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలో కాల్పులు కలకలం రేపాయి. ఆగంతుకులు జరిపిన కాల్పుల్లో రెస్టారెంట్ మేనేజన్ మృతి చెందారు. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో పని చేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్ గాయాన్ పై ఆగంతుకులు కాల్పులు జరిపారు. దేవేందర్ అక్కడిక్కడే మృతి చెందారు.

గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పరార్ అయ్యారు. కాల్పుల్లో మృతి చెందిన దేవేందర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు దేవేందర్ గాయాన్ కలకత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 నెలల నుండి హోటల్ లో దేవేందర్ జనరల్ మేనేజర్ పని చేస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Delhi : తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చెల్లెలిపై కాల్పులు జరిపిన మహిళ

ప్రేమ వ్యవహారంమే కాల్పులకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేవేందర్ తో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులే కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి రిత్విక్ గా గుర్తించారు. రిత్విక్ కలకత్తా వాసిగా అనుమానిస్తున్నారు.

కాల్పుల అనంతరం నిందితుడు కలకత్తాకు పారి పోయినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హోటల్ సిబ్బంది స్టేట్ మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.