Fake currency : రోడ్డుపై గుట్టలుగా రూ.2వేల నోట్ల కట్టలు.. ఎగబడిన జనం..
హైదరాబాద్ సిటీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. మాదాపూర్ పరిధిలో రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి.

Rs. 2000 Fake Currency Notes On Road Of Middle In Madhapur
Fake currency Notes : హైదరాబాద్ సిటీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. మాదాపూర్ పరిధిలో రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పోసిన కరెన్సీ నోట్లను చూసి అటుగా వెళ్లే జనమంతా ఎగబడి చూస్తున్నారు. 100 ఫీట్ రోడ్ సమీపంలోని కాకతీయ రోడ్డులో రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. నోట్లను చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు.
దొరికిన కరెన్సీ నోట్లను చాలామంది అందుకుపోయారు. రూ.2వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండటంతో నోట్లు తీసుకెళ్లినవారంతా నిరుత్సాహానికి గురయ్యారు. నకిలీ కరెన్సీ నోట్లని తెలియక చాలామంది నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు.
రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న నకిలీ రూ.2వేల కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాదిలో హైదరాబాద్ నగరంలోని గోల్కండ పరిధిలో నకిలీ కరెన్సీ కలకం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లతో సంబంధం కలిగిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో దగ్గర లభ్యమైన సంచుల్లో రూ.2వేలు, రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also : Covid Test Kit : కొవిడ్ హోం టెస్ట్ కిట్లు.. క్షణాల్లో ఫలితాలు.. ఎలా ఉపయోగించాలో తెలుసా?