Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోవిడ్ టెస్టుల ధరలపై నిర్ణయం!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్టుల ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రూ.500కే ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Shamshabad Airport :  శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్టుల ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500కే ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ పోర్టులో RTPCR టెస్టుకు రూ.4,500 వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

వరుస ఫిర్యాదులతో తెలంగాణ సర్కార్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్టులపై ధరలను నిర్ణయించింది. కోవిడ్ టెస్టుకు అధిక డబ్బులు వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. కోవిడ్ టెస్టుల ధరలను ఎయిర్ పోర్టులో డిస్ ప్లే చేయాలని ఆదేశించింది. వాట్సాప్ నెం. 9154170960కు ఫిర్యాదు చేయొచ్చునని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.

మరోవైపు.. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్ ను కలవరపెడుతోంది. ఇప్పటికే భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది. అంతకుముందు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది.

శనివారం ఒక్కరోజే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. గుజారత్ జామ్ నగర్ లోని వ్యక్తికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు గుర్తించారు. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన కళ్యాణ్-డోంబివిలీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి #Omicron వేరియంట్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also : Venkaiah Naidu On Omicron : ఒమిక్రాన్ గురించి ఆందోళన వద్దు…జాగ్రత్తలు తప్పనిసరి- వెంకయ్యనాయుడు

ట్రెండింగ్ వార్తలు