Kamreddy : ఆర్టీసీ – కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి, భయానకంగా ప్రమాద దృశ్యాలు
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, షిప్ట్ (Swift Car) ఢీకొన్నాయి.

Road Accident
Kamareddy Road Accident : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యానికి తోడు అత్యవంత వేగంగా ప్రయాణిస్తూ.. ఇతరుల ప్రాణాలు తీస్తుండడమే కాకుండా.. వారి ప్రాణాలు సైతం పోతున్నాయి. ఏపీలోని తిరుపతిలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థానికి వెళుతూ.. ఈ ప్రమాదం జరగడం అందర్నీ కలిచివేసింది. ప్రధాన మంత్రి, ఏపీ సీఎంలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు.
Read More : Tinder app : కారు లిఫ్ట్ కోసం డేటింగ్ నాటకమాడిన యువతి
తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, షిప్ట్ (Swift Car) ఢీకొన్నాయి. కారులో నుంచి మృతదేహాలు బయటపడి.. ఛిద్రమయ్యాయి. దీంతో ఆ రోడ్డంత భయానకంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని ఘన్పూర్ గ్రామ శివారు మూల మలుపు దగ్గర .. ఆర్టీసీ బస్సు, షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More : Vikarabad : పదో తరగతి బాలికపై అత్యాచారం? హత్య
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నుంచి మృతదేహాలు బయటకు ఎగిరిపడ్డాయి. కొన్ని మృతదేహాలు చిధ్రమయ్యాయి. దీంతో ఘటనా స్థలంలో ప్రమాద దృశ్యాలు భయానకంగా మారాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అటు చనిపోయినవారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.. ఒకరు కారు డ్రైవర్ నరేంద్రగా తేల్చారు. మృతి చెందిన వారిలో సర్వేయర్ రాధాకృష్ణ, ఆయన భార్య కల్పన, తల్లి సువర్ణ, కొడుకు శ్రీరామ్‌తో పాటు డ్రైవర్ నరేంద్ర ఉన్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాధాకృష్ణ పెద్ద కొడుకు రాఘవ పరిస్థితి .. విషమంగా ఉంది.