Hyderabad: రాజకీయ వ్యూహకర్త సునీల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు ఆ ఆఫీసును, ల్యాప్ లాప్ లను సీజ్ చేశారు. పోలీసుల తనిఖీలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

Hyderabad

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు ఆ ఆఫీసును, ల్యాప్ లాప్ లను సీజ్ చేశారు. అలాగే, కార్యాలయంలోని సిబ్బంది మొబైల్ ఫోన్లను ఆఫ్ చేయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల్లో పోస్టులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల తనిఖీలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని అంటున్నారు. సోదాల విషయం తెలుసుకుని సునీల్ కార్యాలయానికి పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు.

ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా సీజ్ చేస్తారని షబ్బీర్ అలీ, మల్లు రవి నిలదీశారు. అక్కడ పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. షబ్బీర్ అలీ, మల్లు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి ఇళ్ల వద్ద వారిని వదిలేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

పోలీసులు వ్యవహిరంచిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు. రేపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నాకు దిగుతామని చెప్పారు. కాగా, మాదాపూర్ లోని కార్యాలయం వేదికగా కొందరు నకిలీ ఖాతాలు తెరిచారని, ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతోందని, తమకు ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకుంటున్నామని సైబర్ క్రైమ్ ఏసీపీ చెప్పారు.

FIFA World Cup 2022: సెమీఫైనల్లో క్రొయేషియా చిత్తు.. ఫైనల్లోకి దూసుకెళ్లిన మెస్సీ జట్టు