సెక్రటేరియట్‌కు భారీగా చేరుకున్న గ్రూప్ 1 అభ్యర్థులు.. ప్రధాన గేట్ ముందు వందలాది మంది అభ్యర్థుల బైఠాయింపు

బీఆర్కే భవన్ వద్ద రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు బైఠాయించారు.

తెలంగాణ సెక్రటేరియట్‌కు గ్రూప్‌ 1 అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. సెక్రటేరియట్‌ ప్రధాన గేట్ ముందు వందలాది మంది బైఠాయించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్‌ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు.

బీఆర్కే భవన్ వద్ద రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు బైఠాయించారు. వారు సచివాలయం వైపు వెళ్తుండగా సెక్రటేరియట్‌ గేట్లను పోలీసులు మూసేశారు. సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు, ఇంద్ర పార్క్ రామకృష్ణ మటం వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వాహనం ముందుకెళ్లకుండా రోడ్డుపై గ్రూప్ వన్ అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు బైఠాయించారు. రామకృష్ణ మఠం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

పోలీసులకు, గ్రూప్ వన్ విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. తమకు న్యాయం చేయాలని, రాజ్యాంగం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అశోక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో 29 పై చర్చలకు రమ్మన్ని పిలిచారు. ఇదే విషయాన్ని నిరుద్యోగులకు బండి సంజయ్ వివరించారు.

Viral Video: ఐఐటీలోని మెస్‌లో ఎలుకలు.. చూసి వికారానికి గురైన విద్యార్థులు