వేములవాడలో రెండురోజుల ముందే సద్దుల బతుకమ్మ .. ఎందుకంటే?

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 08:07 AM IST
వేములవాడలో రెండురోజుల ముందే సద్దుల బతుకమ్మ .. ఎందుకంటే?

Updated On : October 4, 2019 / 8:07 AM IST

తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ వేడుకలు మొత్తం 9 రోజులు నిర్వహిస్తారు. ఒక్కొరోజుకు ఒక్కొ స్పెషల్ ఉంటుంది. అయితే అన్నీ చోట్ల ఆఖరి 9వ రోజు ‘సద్దుల బతుకమ్మ’ ను ఆరాధిస్తారు. ఆరోజు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేసి గౌరమ్మను సాగనంపుతారు. కానీ వేములవాడలో మాత్రం ఈ రోజు (అక్టోబర్ 4, 2019)న నిర్వహిస్తున్నారు. అందేంటి అనుకుంటున్నారా..?

వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మను అక్టోబర్ 6వ తేదీన నిర్వహించనున్నారు. అయితే వేములవాడలో రెండు రోజులకు ముందే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వేములవాడ లోని మూలవాగు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 

ఇక్కడ ప్రతీ ఏడాది ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. అది వీళ్ల ఆనవాయితీ. అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రం కాబట్టి రెండు రోజుల ముందే సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించి ఆ తల్లిని పూజిస్తారు. కేవలం ఇది వేములవాడ పట్టణంలో మాత్రమే కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలను యధావిధిగా తొమ్మిది రోజులకు బతుకమ్మ ఆడతారు.