Samsung Galaxy S25 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ తేదీ ఎప్పుడంటే?

Samsung Galaxy S25 Series : కొత్త లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుందని సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుందని భావిస్తున్నారు.

Samsung Galaxy S25 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ తేదీ ఎప్పుడంటే?

Samsung Galaxy S25 Series Tipped to Launch

Updated On : November 15, 2024 / 11:31 PM IST

Samsung Galaxy S25 Series Launch : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. ఇప్పటికే, ఈ గెలాక్సీ ఫోన్ మోడల్ గురించి అనేక లీక్‌లు, పుకార్లు వచ్చాయి. దక్షిణ కొరియా టెక్ మేజర్ అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు.

అయితే, కొత్త లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుందని సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుందని భావిస్తున్నారు. రాబోయే లైనప్‌లో కొత్త గెలాక్సీ ఎస్25 స్లిమ్ మోడల్‌తో పాటు రెగ్యులర్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25+, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా మోడల్‌లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ తేదీ? :
నివేదిక ప్రకారం.. శాంసంగ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గెలాక్సీ ఎస్25 సిరీస్ జనవరి 23, 2025న లాంచ్ కానుంది. లైనప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నారు. సాధారణ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా మోడల్స్‌తో పాటు శాంసంగ్ చాలా కాలంగా పుకార్లు ఉన్న గెలాక్సీ ఎస్25 స్లిమ్‌ను కూడా ఈవెంట్‌లో ప్రవేశపెట్టనుంది. మునుపటి పుకార్లు స్లిమ్ మోడల్ నెక్స్ట్ లాంచ్ తేదీని సూచించాయి.

వచ్చే ఏడాది జనవరి 22న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించవచ్చు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ ఎస్25 సిరీస్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆవిష్కరించవచ్చునని వెల్లడించింది. అయితే, కంపెనీ కచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు. శాంసంగ్ ఫోన్ల కోసం జనవరి 5 లాంచ్ తేదీని సూచిస్తూ ఈ వారం ప్రారంభంలో నివేదికలు వెలువడ్డాయి. ఈ ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ జనవరి 17న కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో లాంచ్ అయింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ గత ఏడాది ఫిబ్రవరి 1న మార్కెట్లోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 లైనప్‌లోని అన్ని ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌లో రన్ అవుతాయని అంచనా. కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ మొత్తం 7 కలర్ ఆప్షన్లలో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ మొత్తం 8 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

Read Also : UPPSC Prelims Exam : విద్యార్థుల డిమాండ్లతో దిగొచ్చిన యోగి సర్కార్.. ఒకే రోజున యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష!