Santoshnagar :గ్యాంగ్ రేప్, అంతా ఫేక్..యువతి హై డ్రామా, ప్రియుడిని ఇరికించేందుకే

ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ యువతి సంతోష్ నగర్ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

Rape

Santosh Nagar Gang Rape : ఆటోడ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ యువతి సంతోష్ నగర్ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్‌లో తనను కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. పహాడీ షరీఫ్ ప్రాంతంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 20 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు తక్షణం స్పందించారు.

Read More : Indore : తృటిలోప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటీజీలను పరిశీలించారు. హుటాహుటిన 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దర్యాప్తు చేపట్టాయి. దీంతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం సీసీ కెమెరాలను పరిశీలించారు. కిడ్నాప్ సమయం సీసీ ఫుటేజ్ సమయానికి పొంతన లేదని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్రశ్నించగా..అసలు విషయం బయటపెట్టింది యువతి. ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో…అతడిని కేసులో ఇరికించేందుకు డ్రామా ఆడినట్లు యువతి వెల్లడించింది.

Read More : Bank Locker Rules: బ్యాంకుల్లో లాకర్ల రూల్స్‌పై ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు తాను ఆటో ఎక్కానని యువతి చెప్పింది. ఆమెతో ఉన్న మహిళ ఆటో దిగగానే మరో ఇద్దరు యువకులు ఆటోలో ఎక్కి.. తనను బలవంతంగా చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌వైపు తీసుకెళ్లారని తెలిపింది. తనపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయారని చెప్పింది. అక్కడి నుంచి తాను బస్సులో ఇంటికి వెళ్లానని చెప్పిన యువతి.. బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read More : WhatsApp : లింక్ పంపుతారు..ఓటీపీ చెప్పమంటారు..తర్వాత, హైదరాబాద్‌‌లో మరో మోసం

అయితే యువతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్‌ను పరిశీలించారు. ఘటనాస్థలంలో అత్యాచారం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాధితురాలు చెప్పిన వివరాలతో సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ మ్యాచ్ అవడం లేదన్నారు పోలీసులు. యువతి ఆటో ఎక్కిన దగ్గరి నుంచి సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసును కావాలనే తప్పుదోవ పట్టిస్తుందా? లేక నిజంగానే అత్యాచారం జరిగిందా? అని పోలీసులు తొలుత భావించారు. అనుకున్నట్లుగానే…అత్యాచారం..అంతా ఫేక్ అని తేల్చారు.