Indore : తృటిలోప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాదవశాత్తు.. రైలు.. ప్లాట్ఫారం మధ్యలో పడిపోయింది. పక్కన ఉన్నవారు అప్రమత్తమై ఆమెను రక్షించారు.

Indore
Indore : కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాదవశాత్తు.. రైలు.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయింది. దీంతో పక్కన ఉన్నవారు అప్రమత్తమై ఆమెను రక్షించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ రైల్వేస్ స్టేషన్ లో బుధవారం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే రైలు ఎక్కేందుకు ఓ మహిళ, మరో వ్యక్తి ఓ చిన్నారి ఇండోర్ రైల్వేస్ స్టేషన్ కి వచ్చారు. వారు ప్లాట్‌ఫాం మీదకు వచ్చే సరికి రైలు కదిలింది. బాబును ఎత్తుకున్న వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కాడు. ఇంకో డోర్ నుంచి మహిళా ఎక్కేందుకు ప్రయతించింది.
ఈ సమయంలోనే ఆమె అదుపుతప్పి రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోయింది. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు అప్రమత్తమై ఆమెను కాపాడారు. ఇదే సమయంలో రైల్లోని ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ప్రమాదం నుంచి మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.
#WATCH | Madhya Pradesh: Fellow passengers saved the life of a woman in Indore who was trying to board a moving train, yesterday.
(Video source: Railway Protection Force, Indore) pic.twitter.com/0HgbYLrnwq
— ANI (@ANI) August 19, 2021