Schools Re-open : సెప్టెంబర్ 1 నుంచి అందరూ స్కూళ్లకు రావాల్సిందే : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ఉండవనీ..విద్యార్ధులంతా స్కూళ్లకు రావాల్సిందేనని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.

School Re Open In Telangana
Schools re-open from September 1 in Telangana : సెప్టెంబర్ 1 నుంచి ఇక ఆన్ లైన్ క్లాసులు ఉండవు..అందరూ స్కూళ్లకు రావాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. కరోనా వల్ల లాక్ డౌన్ పడిన స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఇక ఆన్ లైన్ క్లాసులకు స్వస్తి పలికి ఇకనుంచి అందరూ స్కూల్స్ కు రావాల్సిందేనని మంత్రి వెల్లడించారు. ఇక బడి గంట మోగనుంది. పిల్లలు లేక బోసిపోయిన స్కూళ్లలో మళ్లీ సందడి మొదలుకానుందని మంత్రి వెల్లడించారు. గత 17నెలల నుండి అన్ని వ్యవస్థలు అతలకూతలం అయ్యాయని..
విద్యా సంస్థలు ప్రారంభం విషయంపై సోమవారం సీఎం కేసీఆర్ 3 గంటల పాటు రివ్యూ చేశారని..సీఎం నిర్ణయం మేరకు సెప్టెంబరు 1 విద్యా సంస్థలు ప్రారంభం కాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. దీంతో 60లక్షల మంది విద్యార్ధులు స్కూల్ కి రాబోతున్నారనీ తెలిపారు. అంగన్ వాడి సంస్థలను కూడా ప్రారంబించాని నిర్ణయించామని..దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారులు,నాయకుల పలు సూచనలు చెశామని మంత్రి తెలిపారు.
హెడ్ మాస్టర్ లు టీచర్లకు,విద్యార్ధులకు ఇంకా స్కూల్ అటెండర్లకు అందరికి కో ఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు.మధ్యాహ్నా భోజనం నిర్వహాకులకు కూడా జాగ్రత్తలు పాటిచాలని సుచించామని..పేరెంట్స్ పిల్లలను స్కూల్ పంపే వారు ట్రాన్స్ పోర్ట్ విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. స్కూల్ వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని,ప్రైవేట్ స్కూల్స్ కు..సూచించామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ GO నెంబర్ 46 ప్రకారమే ఫీజులు వసూళ్లు చెయ్యాలని..తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దని స్కూల్స్ రీ ఓపెన్స్ సందర్భంగా విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.
కాగా.. కరోనా మహమ్మారి ప్రభావంతో గత ఏడాది నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్య కొంతకాలం తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. సెకండ్ వేవ్ ఉదృతి పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్ తరగతులకే పరిమితం చేశారు. జులై మొదటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు పలు అభ్యంతరాలు వ్యక్తంచేయటంతో స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది.
సెప్టెంబర్ 1 నుంచి విద్యాలయాల రీ ఓపెన్ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేస్తూ పలు సూచనలు చేశారు. దాదాపు రెండేళ్లుగా స్కూల్స్ మూతబడి ఉండడం వల్ల గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా ఉండాలే చూసుకునే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లే చూసుకోవాలని తెలిపారు.
మరో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్న క్రమంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రపరచాలని తెలిపారు. విద్యాసంస్థల పరిధిల్లోని వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని..అలాగే క్లాస్ రూమ్స్ లను శుభ్రంగా కడిగించి సానిటైజేషన్ చేయించాలని సీఎం కేసీఆర్ సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను ఆదేశించారు.
దీని కోసం జిల్లా పరిషత్ చైర్మన్లు వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి మండలాల్లో పర్యటించి అన్నిస్కూల్స్ సానిటైజేషన్ పరిశుభ్రంగా వున్నయో లేవో పరిశీలించాలన్నారు. ఆగస్టు 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యాసంస్థల సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూల్స్ ఓపెన్ చేశాక విద్యార్థినీ విద్యార్థులకు జ్వరం, జబులు వంటివి వస్తే..ఆయా స్కూళ్ల హెడ్ మాస్టార్లు, అదే ప్రైవేటు స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి..కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
పాజిటివ్ వస్తే..సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సీఎం సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నిబంధనలు పాటించేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ తల్లిదండ్రులు విజ్నప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూసుకోవాలని సూచించారు.
కాగా..గత కొన్ని రోజులుగా తెలంగాణాలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఆగస్టు నెలలోనే విద్యాసంస్థలు తెరిచాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఆన్‌లైన్ క్లాసులు ఏమాత్రం మంచి ఫలితాలు ఇవ్వకపోవటం..కూడా కారణంగా కనిపిస్తోంది.కాగా..తెలంగాణాలో కొత్తగా 46,987 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..కేవలం 231 మందికి మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.