ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చారు: మంత్రి సీతక్క
ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లలో మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నారని చెప్పారు.

Seethakka
నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చారని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంత్రి సీతక్క మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయని తెలిపారు.
ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లలో మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నారని చెప్పారు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్ పూర్ రావాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పట్టా సుధాకర్ కూడా ఇథనాల్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు.
గురుకులాల గురించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గురుకులాల్లో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పనా కేటీఆర్? అని ఆమె అన్నారు. మంత్రులు, అధికారులు అందరూ కలిసి గరుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. హస్టళ్లపై బీఆర్ఎస్ పెద్ద కుట్ర చేస్తోందని అన్నారు. దీని వెనక ఎవరు ఉన్నా చర్యలు తప్పవని చెప్పారు.
లగచర్లలో గ్రామ సభ జరుగుతోందని, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందని తెలిపారు.
కొల్లాపూర్‌లో ఘనంగా ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాలు.. ముఖ్య అతిథిగా మై హోం రామేశ్వర్‌రావు..