కొల్లాపూర్‌లో ఘనంగా ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాలు.. ముఖ్య అతిథిగా మై హోం రామేశ్వర్‌రావు..
ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు స్ఫూర్తిగా విద్యార్థులంతా తమ జీవితంలో సక్సెస్ సాధించాలని అన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా… కొల్లాపూర్ పట్టణంలో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం ఘనంగా జరిగింది. నేటితో రెండో రోజుకు చేరుకున్నాయి స్వర్ణోత్సవాలు.
పూర్వ విద్యార్థులతో కలిసి ఆత్మీయ సమేళనంలో అతిథులుగా మై హోం సంస్థల అధినేత రామేశ్వర్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీనటుడు విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ప్రజాకవులు అందెశ్రీ, జయరాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు స్ఫూర్తిగా విద్యార్థులంతా తమ జీవితంలో సక్సెస్ సాధించాలని అన్నారు. కొల్లాపూర్ బలం చూశానని, భవిష్యత్తునూ చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆర్‌ఐడీలో తన తల్లి చదువుకున్నారని తెలిపారు.