వసతి గృహాల్లో తరుచూ వివాదాస్పద ఘటనలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని చెప్పారు.

CM Revanth Reddy
తెలంగాణలోని విద్యార్థుల వసతి గృహాల్లో తరుచూ వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటుండడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని చెప్పారు. స్కూళ్లు, గురుకులాలను తరుచూ తనిఖీ చేయాలని అన్నారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని చెప్పారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధ్యులను చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, వసతి గృహాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వసతి గృహాల్లో తరుచూ విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.