Anam Ramanarayana Reddy: అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలు తనిఖీ చేశాను: ఆనం రామనారాయణరెడ్డి

దర్శనం అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Anam Ramanarayana Reddy: అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలు తనిఖీ చేశాను: ఆనం రామనారాయణరెడ్డి

Anam Ramanarayana Reddy

Updated On : November 28, 2024 / 9:47 AM IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనం అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలు తనిఖీ చేశానని తెలిపారు. సౌకర్యాలు బాగున్నాయని ఫిర్యాదుల పుస్తకంలో భక్తులు రాశారని వివరించారు.

తిరుమల ప్రక్షాళన చేయాలన్న సీఎం ఆకాంక్ష మేరకు ఇంకా అభివృద్ధి చేయాలని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నిర్మించిన కొత్త ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు రూ.10 వేల చొప్పున ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని మంత్రి అన్నారు. మరికొన్ని కొత్త ఆలయాల అప్లికేషన్లు వచ్చాయని, పరిశీలించాక ఇస్తామని తెలిపారు.

కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ వీళ్లు పని చేస్తున్నారు: కేటీఆర్