మీడియా కెమెరామెన్‌తో దురుసుగా ప్రవర్తించిన పాశం యాదగిరి

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 12:49 AM IST
మీడియా కెమెరామెన్‌తో దురుసుగా ప్రవర్తించిన పాశం యాదగిరి

Updated On : November 20, 2020 / 6:57 AM IST

Senior Journalist Pasham Yadagiri  : బీజేపీ కార్యాలయం వద్ద సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి మీడియాపై దాడికి యత్నించారు. విజువల్స్‌ ఎందుకు తీస్తున్నావంటూ కెమెరామెన్‌పై దురుసుగా ప్రవర్తించారు. పాశం యాదగిరి బంధువుకు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. గోల్కొండ డివిజన్‌ నుంచి పాశం శకుంతల బరిలోకి దిగుతున్నారు. అయితే బి.ఫారమ్‌ తీసుకునేందుకు బీజేపీ కార్యాలయానికి పాశం యాదగిరి వచ్చారు.



ఈ సమయంలో విజువల్స్‌ చిత్రీకరిస్తున్న కెమెరామెన్‌పై పాశం యాదగిరి దాడికి యత్నించారు. కెమెరామెన్‌ మాస్క్‌ లాగేశారు. దురుసుగా ప్రవర్తించిన పాశం యాదగిరి తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది బీజేపీ. బుధవారం 21మందిని ప్రకటించగా.. గురువారం మరో 18 మందితో సెకండ్ లిస్ట్‌ విడుదల చేసింది. దుబ్బాక లాగే ఇక్కడ కూడా సింగిల్‌గానే బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే జనసేనను కాదని ఒంటరిగా పోటి చేసేందుకు మొగ్గు చూపింది.