Senior Resident Doctors : కొనసాగుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన
తెలంగాణాలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్లాక్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు.

Sr Resident Doctors
Senior Resident Doctors : తెలంగాణాలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్లాక్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు. ఇవ్వాల్టి నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా బహిష్కరించి నిరసన చేపట్టారు.నిన్న మంత్రి హరీష్ రావు జీతాలు వెంటనే ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే తాము కోవిడ్ సమయంలో డ్యూటీ చేసినప్పటికీ జీతాలు ఇవ్వలేదని….తమ SR ship ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ ఇవ్వలేదని…వాటిపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు వెల్లడించారు.
Also Read : Ashada Bonalu 2022 : ప్రారంభమైన ఆషాఢ బోనాలు