Bindu Death Case : ల్యాంకోహిల్స్‌ బిందు ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో పోలీసుల చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Bindu Death Case : ల్యాంకోహిల్స్‌ బిందు ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Bindu Death Case

Updated On : August 14, 2023 / 10:57 AM IST

Bindu Death Case : హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాంకోహిల్స్‌లో గత శుక్రవారం అర్థరాత్రి 21 అంతస్థుల భవనం పైనుంచి బిందు శ్రీ అనే యువతి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో పోలీసుల చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ బిందును పూర్ణ చందర్‌ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..

బిందు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. కొన్ని సంవత్సరాలుగా పూర్ణచందర్ ఇంట్లో చిల్డ్రన్ కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. సినిమా అవకాశాల పేరుతో బిందును పూర్ణచందర్ మచ్చిక చేసుకున్నాడు. కొన్నాళ్లుగా బిందుతో సహజీవనం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, బిందు ఎదుటే మరో యువతితో పూర్ణచందర్ రావు స్నేహంగా ఉండటంతో సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని బిందు గుర్తించి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో రాయదుర్గంలోని ల్యాంకోహిల్స్ 21 అంతస్థుల భవనం పైనుంచి కిందికి దూకి బిందు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Crime News: పార్కులో ఉన్న అమ్మాయిని అతి దారుణంగా చంపేసిన యువకుడు

బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బిందు రాసిన సూసైడ్ లేఖ ఆధారంగా కావాలనే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బిందు తండ్రి ఆరోపిస్తున్నారు. బిందు ఆత్మహత్య చేసుకునేంత పిరికిరాలు కాదని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నిరోజులు ల్యాంకోహిల్స్‌లో మృతురాలు నివాసం ఉంది. ఆమె ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు బిందు మృతి కేసులో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.