Drugs Case: నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు.. సుశాంత్ రెడ్డి ఏమన్నారంటే?
నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురికి కేపీ చౌదరి డగ్స్ విక్రయించినట్లు రెండు రోజులుగా పోలీసులు జరుపుతున్న విచారణలో తెలుస్తోంది.

KP Chaudhary
KP Chaudhary: నిర్మాత కేపి చౌదరి (KP Chaudhary) డ్రగ్స్ కేసు (Drug case) లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్ (Tollywood) కు చెందిన పలువురికి కేపీ చౌదరి డగ్స్ విక్రయించినట్లు రెండు రోజులుగా పోలీసులు జరుపుతున్న విచారణలో తెలుస్తోంది. పోలీసుల విచారణలో కొద్దిమంది వివరాలు మాత్రమే కేపీ వెల్లడించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. తెలుగు బిగ్‌బాస్ ఫెమ్ అషురెడ్డి, తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ జ్యోతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి.. వీరి ముగ్గురితో వందలాది సార్లు కేపీ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కాల్స్‌పై కేపీ మాత్రం నోరు మెదపలేదని పోలీసులు తెలిపారు.
12మందిలో బడా బాబుల, పలువురు యువతుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కేపి బ్యాంక్ లావాదేవీలనుసైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. కేపీ ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలు పోలీసులు గుర్తించారు. కేపీ లిస్ట్‌లో డ్రగ్ కన్స్యూమర్స్‌గా రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, టాగోర్, ప్రసాద్‌లు ఉన్నారు. అయితే సెలబ్రిటీల కాంటాక్ట్ లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్ లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. ఈ నెల 14న నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ సప్లయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అతడిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచి, చర్లపల్లి జైలుకి పంపారు. కేపీ చౌదరి కస్టడీ కోరుతూ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు రాజేంద్రనగర్ పోలీసులు.
ఎలాంటి టెస్ట్‌కి అయినా నేను రెడీ: సుశాంత్ రెడ్డి
డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి చెప్పిన లిస్ట్‌లో సుశాంత్ రెడ్డి పేరు కూడా ఉంది. సుశాంత్ రెడ్డి టాలీవుడ్ యాక్టర్. తాజాగా సుశాంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. నాకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసు. కొన్నిసార్లు కలిశాను. అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడాను. మూడేళ్ల నుంచి ఆయనను కలవలేదని అన్నారు. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. డ్రగ్స్ పరంగా ఎలాంటి సంబంధం లేదు. మా మధ్య ఆ టాపిక్ కూడా రాలేదని సుశాంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి టెస్ట్‌కి అయినా నేను రెడీ. పోలీసుల నుంచి ఎదైనా కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా. ఎలాంటి విచారణ కు అయినా సిద్ధంగా ఉన్నాను అని సుశాంత్ రెడ్డి అన్నారు.