Telangana Assembly Eelctions 2023: బీఆర్ఎస్ పార్టీపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు

Telangana Assembly Eelctions 2023: బీఆర్ఎస్ పార్టీపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

Updated On : November 19, 2023 / 3:37 PM IST

భారత్ రాష్ట్ర సమితి పార్టీపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లో ఏక్‭నాథ్ షిండేలు తయారయ్యారని, పార్టీ మూడు ముక్కలు కావాదం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇక బీఆర్ఎస్ ముగినే నావని, బీజేపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అయిందని, ఇక ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని షబ్బీర్ ఎద్దేవా చేశారు.

పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు. నిజమాబాద్ అర్బన్ లో తనకు ఎవరూ పోటీ కాదని, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తన దరిదాపుల్లో కూడా లేరని, అక్కడ కాంగ్రెస్ పార్టీదే విజయమని షబ్బీర్ అన్నారు.