Hyderabad: హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై అత్యాచారం.. లిఫ్ట్ పేరుతో కారెక్కించుకొని..
హైదరాబాద్ దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది.

foreign woman
Shocking Incident in Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కిన కొందరు యువకులు ఘాతుకానికి ఒడిగట్టారు. సదరు యువతి వారి నుంచి తప్పించుకొని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సెలవుల నిమిత్తం జర్మన్ యువతి హైదరాబాద్ కు వచ్చింది. తన ఫ్రెండ్ తో కలిసి హైదరాబాద్ లోని మంద మలమ్మ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ఉంటుంది. షాపింగ్ కోసం కారులో బయలుదేరింది. కారును అడ్డగించిన కొందరు యువకులు లిఫ్ట్ కావాలని అడిగారు. ఆ తరువాత బలవంతంగా కారులో ఎక్కారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులోని వ్యక్తులు యువతిపై అత్యాచారంకు పాల్పడ్డారు.
వారినుంచి తప్పించుకున్న బాధితురాలు పహాడీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు రంగంలోకిదిగి ఘటనా స్థలం, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఎవరు అన్నది గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.