Hyderabad : అందం కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా? మహిళలూ బీకేర్‌ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

అందం కోసం బ్యూటీపార్లర్ కు తరుచుగా వెళ్లే వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలానే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. Hyderabad Beauty Parlour

Hyderabad : అందం కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా? మహిళలూ బీకేర్‌ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

Hyderabad Beauty Parlour

Hyderabad Beauty Parlour : నలుగురిలో అందంగా కనిపించాలని, తమ అందానికి మెరుగులు దిద్దాలని చాలామంది ఆడవాళ్లు ఆరాటపడతారు. అది కామన్. అందుకోసం ఎక్కువమంది బ్యూటీపార్లర్ ను ఆశ్రయిస్తారు. బ్యాటీపార్లర్ కు వెళ్లి తమ బ్యూటీని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, కొన్నిసార్లు ఈ తరహా ప్రయత్నం బెడిసికొట్టే ఛాన్సుంది. అందానికి మెరుగులు దిద్దుకోవడం ఏమో కానీ, లేనిపోని సమస్యలు వచ్చిపడుతున్నాయి. కొత్త చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు కొందరు ఆడవాళ్లు. తాజాగా హైదరాబాద్ లో ఆ తరహా ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ మహిళ అందం కోసం బ్యూటీపార్లర్ కు వెళితే.. ఆమె జట్టు ఊడిపోయింది. బ్యాటీపార్లర్ నిర్వాకంతో జుట్టంతా ఊడి అంద విహీనంగా తయారైంది. దాంతో బాధితురాలు లబోదిబోమంటోంది.

వివరాల్లోకి వెళితే.. తన భర్తకు మోడ్రన్ గా కనిపించాలని ఓ మహిళ ఆరాటపడింది. హెయిర్ కట్ చేసుకుని స్టైలిష్ గా మారాలని ఆశించింది. అయితే, ఆమె ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది మరొకటి. ఆ మహిళకు అసలుకే ఎసరొచ్చింది. అబిడ్స్ లోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకంతో మొత్తం జుట్టు ఊడిపోయింది. కొత్త జుట్టు రావడం అటుంచితే, ఉన్న జుట్టు కూడా పోయింది. అందవిహీనంగా తయారైంది. దాంతో తనకు న్యాయం చేయాలంటూ బ్యూటీపార్లర్ ముందు కుటుంబసభ్యులతో కలిసి బాధితురాలు ఆందోళన చేపట్టింది.

Also Read..Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

”జుట్టుకి కలర్ వేయించుకోవడానికి మా అక్క బ్యూటీపార్లర్ కి వచ్చింది. అయితే, ఒక్క మాట కూడా చెప్పకుండానే, అనుమతి తీసుకోకుండానే మా అక్క జట్టుని కత్తిరించారు. ఆ తర్వాత జుట్టు బాగా పెరుగుతుందని చెప్పి ఏదో నూనె పూశారు. అంతే ఘోరం జరిగిపోయింది. జుట్టు దారుణంగా తయారైంది. జుట్టు ఎక్కువగా రాలుతోంది. కొత్త జుట్టు రాకపోగా ఉన్న జుట్టు కూడా ఊడింది. ఇప్పుడు మా అక్క పరిస్థితి దారుణంగా ఉంది. నలుగురిలో తిరగలేకపోతోంది. తన ముఖాన్ని ఎవరికీ చూపించలేకపోతోంది. మాకు న్యాయం జరగాలి. మేము డబ్బులు డిమాండ్ చేయడం లేదు. చికిత్స చేయించాలని అడుగుతున్నాం. మరో మహిళకు ఇలాంటి అన్యాయం జరక్కుండా చూడాలి” అని బాధితురాలి చెల్లెలు డిమాండ్ చేసింది.

Also Read..Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?

దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్యూటీపార్లర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, బ్యూటీపార్లర్ నిర్వాకంతో ఓ మహిళ తన జుట్టుని కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అందం కోసం బ్యూటీపార్లర్ కు తరుచుగా వెళ్లే ఆడోళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. లేదంటే, ఇదిగో ఇలానే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.