Gold Necklace Missing : 10 తులాల నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ.. గంటలో వెతికి తెచ్చిన పోలీసులు
ఓ మహిళ రూ.5 లక్షల విలువ చేసే 10 తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకుంది. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంట వ్యవధిలో నెక్లెస్ గుర్తించి ఆమెకు అప్పగించారు.

Gold Necklace Missing
Gold Necklace Missing : ఓ మహిళ రూ.5 లక్షల విలువ చేసే 10 తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకుంది. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంట వ్యవధిలో నెక్లెస్ గుర్తించి ఆమెకు అప్పగించారు. ఈ సంఘటన సిద్ధిపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన బొలగం నవిత శనివారం షాపింగ్ కోసం బయటకు వెళ్ళింది. తనతోపాటు తెచ్చుకున్న బ్యాగ్‌లో తన 10 తులాల నెక్లెస్ పెట్టింది.
చదవండి : Car Accident Siddipet : సిధ్దిపేట జిల్లాలో విషాదం-బావిలో పడ్డ కారు
షాపింగ్ అనంతరం ఇంటికి వెళ్లి చూసుకోగా నెక్లెస్ ఉన్న బ్యాగ్ కనిపించలేదు. దీంతో డయల్ 100కి సమాచారం ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె షాపింగ్ చేసిన దుకాణం వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. బంగారం నెక్లెస్ ఉన్న బ్యాగును బట్టల కింద ఉంచినట్లు గుర్తించి నవితకు అప్పగించారు. సకాలంలో స్పందించి బాధితురాలికి బాసటగా నిలిచిన సిబ్బందిని సీపీ జోయల్ డెవిస్ అభినందించారు.
చదవండి : Siddipet : సిద్దిపేట కలెక్టర్ రాజీనామా…టీఆర్ఎస్‌లో చేరుతున్నా