Six died in Nizamabad : పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

నిజామాబాద్ జిల్లా విషాదం నెలకొంది. పోచంపాడు పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

Six died in Nizamabad : పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Six Dead

Updated On : April 2, 2021 / 2:14 PM IST

Six members of the same family died : నిజామాబాద్ జిల్లా విషాదం నెలకొంది. పోచంపాడు పుష్కరఘాట్ లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. గోదావరిలో స్నానం చేస్తుండగా ఆరుగురు గల్లంతు అయ్యారు. ఆరుగురు మృతదేహాలను వెలికితీశారు.

మృతులు సురేశ్ (40), యోగేశ్ (16), శ్రీనివాస్ (40), సిద్ధార్థ్ 16, శ్రీకర్ (14), రాజు (24). మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా మాక్లూర్‌ మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.

వీరి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.