Girl Died : సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ డోర్ తెరవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేళ్ల పాప మృతి

నందిపేటలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన పాప కుంటుబానికి న్యాయం చేయాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Girl Died : సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ డోర్ తెరవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేళ్ల పాప మృతి

girl died of electric shock

Girl Died Electric Shock : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకునే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఆరేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. నందిపేట గ్రామానికి చెందిన శేఖర్ స్థానిక ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ కు షాపింగ్ కోసం వెళ్లారు. తన తండ్రితో కలిసి సూపర్ మార్కెట్ కు వచ్చిన పాప రిఫ్రిజిరేటర్ డోర్ తీసే క్రమంలో కరెంట్ షాక్ కు గురైంది.

ఇది గమనించిన తండ్రి శేఖర్ పాపను నందిపేటలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో పాప కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహంతో ధర్నాకు దిగారు.

Bapatla Current Shock : తీవ్ర విషాదం.. చెట్టెక్కి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు కరెంట్ షాక్, ఒకరు మృతి

నందిపేటలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన పాప కుంటుబానికి న్యాయం చేయాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పాపకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.