Minister Koppula Eshwar: సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశ ఫలితాలు విడుదల

సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశంకొరకు నిర్వహించిన ఎంట్రన్స్ ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

Minister Koppula Eshwar: సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశ ఫలితాలు విడుదల

Koppula

Updated On : July 9, 2022 / 9:50 PM IST

Minister Koppula Eshwar: సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశంకొరకు నిర్వహించిన ఎంట్రన్స్ ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించి గురుకులాల్లో ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి ఈశ్వర్‌, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ అభినందనలు తెలిపారు.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా ఫిబ్రవరి 20న మొత్తం 19,360 సీట్ల భర్తీకి ప్రభుత్వం ప్రవేశ పరీక్ష నిర్వహించింది. 60,173 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇదిలాఉంటే మెరిట్ సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 21 తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీలో చేరాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కుల, ఆదాయ, బదిలీ, స్టడీ సర్టిఫికెట్స్‌తో విద్యార్థులు సకాలంలో హాజరు కావాల్సి ఉంటుందని సొసైటీ జాయింట్ సెక్రెటరీ శక్రు నాయక్ తెలిపారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం tswreis.ac.in లేదా tswrjc.cgg.gov.in వెబ్‌సైట్స్‌ను చూడాలని అధికారులు సూచించారు.