Jagityala Accident : పదేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి తండ్రి వచ్చిన గంట వ్యవధిలోనే.. రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం

తండ్రి మోహన్ ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. సోమవారం ఉదయం సౌదీ నుంచి మోహన్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వెళ్లి తీసుకొచ్చారు. ఇంట్లో తాగు నీరు లేకపోవడంతో తీసుకొచ్చేందుకు కొడుకు శివకార్తిక్ బైక్ పై వెళ్లాడు.

Jagityala Accident : పదేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి తండ్రి వచ్చిన గంట వ్యవధిలోనే.. రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం

Jagityala Accident

Updated On : May 9, 2023 / 3:33 PM IST

Jagityala Accident : జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పదేళ్ల తర్వాత గల్ఫ్ దేశం నుంచి తండ్రి వచ్చిన గంట వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మహాలక్ష్మీ నగర్ కు చెందిన చౌట్ పల్లి, పద్మిని కొడుకు శివకార్తిక్(12) ఐదో తరగతి చదువుతున్నాడు.

అయితే తండ్రి మోహన్ ఉపాధి కోసం పదేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పుడు కొడుకు వయస్సు రెండేళ్లు. సోమవారం ఉదయం సౌదీ నుంచి మోహన్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు వెళ్లి తీసుకొచ్చారు. ఇంట్లో తాగు నీరు లేకపోవడంతో తీసుకొచ్చేందుకు కొడుకు శివకార్తిక్ బైక్ పై వెళ్లాడు.

Road Accident : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు నదిలో పడి 15 మంది మృతి

బైపాస్ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో శివకార్తిక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.

కొడుకు మృతదేహాన్ని చూసి తల్లీతండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శివకార్తిక్ మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.