Sonia Gandhi
telangana assembly election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో చివరి ఎన్నికల ప్రచారాస్త్రంగా సోనియాగాంధీని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవతగా సోనియా గాంధీకి మంచి పేరుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో మూడురోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తుది ప్రచారపర్వంలో తెలంగాణ ఇచ్చిన సోనియాను రప్పించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
ALSO READ : telangana assembly election 2023 : అందని పోస్టల్ బ్యాలెట్లు…ఆందోళనలో పోలింగ్ సిబ్బంది
దీనిలో భాగంగా ఒక్క రోజు తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యర్థించారు. సోనియమ్మను ప్రచారానికి రప్పించాలని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ లను తెలంగాణ నేతలు కోరారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని సోనియాతో ఓటర్లకు చెప్పించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. తుది ప్రచార పర్వంలో సోనియా వస్తే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో విజయావకాశాలు పెరుగుతాయని నేతలు భావిస్తున్నారు.
ALSO READ : No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…
దీంతోపాటు పార్లమెంటులో తెలంగాణ బిల్లు వ్యవహారం, సోనియా పాత్ర, తెలంగాణ కలను సోనియా సాకారం చేసిన వైనంపై వీడియోను రూపొందించి సోషల్ మీడియా, టీవీల ద్వారా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. తెలంగాణ కలను సాకారం చేసిన సోనియమ్మ పేరిట ప్రచారాన్ని ముమ్మరం చేయడం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆ పార్టీ నేతలు తుది దశ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. గతంలో సోనియమ్మతో తెలంగాణలో ఆరు గ్యారంటీలను ప్రకటన జారీ చేయించారు. మొత్తంమీద తెలంగాణ ఎన్నికల తుది దశ ప్రచార పర్వంలో సోనియా పాత్ర కీలకంగా మారింది.