telangana assembly election 2023 : అందని పోస్టల్ బ్యాలెట్లు…ఆందోళనలో పోలింగ్ సిబ్బంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది, అధికారులకు రెండో లెవెల్ శిక్షణ కార్యక్రమం ముగిసినా వారికి ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేదు.....

telangana assembly election 2023 : అందని పోస్టల్ బ్యాలెట్లు…ఆందోళనలో పోలింగ్ సిబ్బంది

postal ballot

Updated On : November 25, 2023 / 9:31 AM IST

telangana assembly election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది, అధికారులకు రెండో లెవెల్ శిక్షణ కార్యక్రమం ముగిసినా వారికి ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేదు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే హక్కును కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బందికి కల్పించింది. పోలింగ్ శిక్షణ కేంద్రానికి పోస్టల్ బ్యాలెట్లను పంపిస్తామని అక్కడే ఓట్లు వేయాలని చెప్పిన ఎన్నికల కమిషన్ తర్వాత తాత్సారం చేస్తోంది.

ALSO READ : Hostages Released : యుద్ధం ప్రారంభమై రెండునెలల తర్వాత 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్

పోలింగ్ సిబ్బందిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు.  ఫాం 12 ద్వారా పోలింగ్ సిబ్బంది ఓటు కోసం దరఖాస్తున్నా, తమకు పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఉపాధ్యాయులు ఆరోపించారు.

ALSO READ : No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…

గతంలో ఉద్యోగులకు నేరుగా ఇంటికి పోస్టులో పోస్టల్ బ్యాలెట్ వచ్చేది. ఈ సారి పోలింగ్ శిక్షణ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని చెప్పి అక్కడ ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల జాప్యంపై రిటర్నింగ్ అధికారులకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

ALSO READ : Best Camera Smartphones : ఈ నవంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఉండగా అధికారులు కావాలని సమన్వయ లోపంతో ఇంకా పంపించకుండా జాప్యం చేస్తున్నారని పోలింగ్ సిబ్బంది ఆరోపించారు. ఈ నెల 25వతేదీలోగా పోస్టల్ బ్యాలెట్లు పంపించాల్సి ఉన్నా ఇంకా అందలేదు.