ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయం సెక్యూరిటీలో మార్పులు.. కారణం ఏంటంటే..
వారిని భద్రత నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Special protection force : సచివాలయం సెక్యూరిటీలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న టీజీఎస్పీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఉమ్మడి ఏపీలో సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రత ఉండేది. అయితే, ఇప్పుడు ఆ భద్రతను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
మొన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర సెక్యూరిటీలో మార్పులు చేశారు. టీజీఎస్పీ స్థానంలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) ఫోర్స్ ను సెక్యూరిటీ సిబ్బందిగా పెట్టారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగానే ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మొన్న కీలక నిర్ణయం తీసుకుంది.
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ఉన్న టీజీఎస్పీ పోలీసులను మార్చుతూ ఏఆర్ పోలీసులను అక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా పెట్టారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో సెక్యూరిటీ విషయంలోనూ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో మొత్తం టీజీఎస్పీ పోలీసులే బందోబస్తులో ఉన్నారు. వారిని భద్రత నుంచి తప్పిస్తూ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కొత్త సచివాలయం నిర్మాణం వరకు.. రాష్ట్ర సచివాలయాలనికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాత్రమే రక్షణ కల్పించేది. అయితే, కొత్త సచివాలయం నిర్మాణం జరిగాక.. నాటి కేసీఆర్ ప్రభుత్వం.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థానంలో టీజీఎస్పీ పోలీసులను సెక్యూరిటీగా మార్చారు. అయితే, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. టీజీఎస్పీ ఫోర్స్ ను మార్చి.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధంగానే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి బాధ్యతలు ఇవ్వాలని ఒక పరిశీలనలో ఉన్న పరిస్థితి ఉంది.
అయితే, కొంతకాలంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి టీజీఎస్పీ స్థానంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులే.. రాష్ట్ర సచివాలయంలో సెక్యూరిటీగా విధులు నిర్వహించబోతున్నారు.
Also Read : ఫాంహౌస్ కేసులో పైచేయి సాధించిందెవరు.?
