Stampede In Bharat Jodo Yatra : హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పాదయాత్రలో తొక్కిసలాట

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఎంజే మార్కెట్ దగ్గర జనం కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.

Stampede In Bharat Jodo Yatra : హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఎంజే మార్కెట్ దగ్గర జనం కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.

పాతబస్తీలో సద్భావన యాత్రలో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత యాత్ర కంటిన్యూ అయ్యింది. కాగా, వేలాది మంది జనం యాత్రకు తరలివచ్చారు. రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో భాగస్వామ్యం అయ్యేందుకు ఉత్సాహం చూపారు. చార్మినార్ నుంచి ఒక్కసారిగా పోటెత్తారు.

పెద్ద ఎత్తున జనం రావడం, రోడ్లు ఇరుక్కుగా ఉండటం.. దీంతో తొక్కిసలాట జరిగింది. వేలాది మంది యాత్రలో పాల్గొనేందుకు తరలిరావడంతో ఒకరిపై ఒకరు తోసుకున్నారు. ఎంజే మార్కెట్ దగ్గర పెద్దఎత్తున జనం గుమికూడటంతో తొక్కిసలాట జరిగింది. కొందరిని తోసేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ తోపులాటలో కింద పడ్డ వారిలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని పక్కకి తీసుకొచ్చారు. వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరికి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేలాది మంది అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొనసాగుతోంది. రాహుల్ గాంధీ యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది.