Nizamabad Hospital : నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో దారుణం.. స్ట్రెచర్ లేక రోగిని కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లిన బంధువులు
మార్చి31న ఓ రోగిని అతని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఓపీలో రిజిస్టర్ చేయించారు.

Nizamabad Hospital
Nizamabad Hospital : నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. స్ట్రెచర్ లేక రోగిని కాళ్లు పట్టుకొని లిఫ్టు వరకు రోగి బంధువులు లాకెళ్లారు. రోగిని కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నా కనీసం ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఏప్రిల్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి31న ఓ రోగిని అతని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు.
మరుసటి రోజు ఓపీలో రిజిస్టర్ చేయించారు. రోగిని రెండో అంతస్తులోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పారు. పెషంట్ ను లిప్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది. అక్కడ స్ట్రెచర్ లేకపోవడంతో రోగిని అతని బంధువులు కాళ్లు పట్టుకొని లిఫ్ట్ వరకు లాకెళ్లారు. దీనిని బట్టి చూస్తే ఎంతటి దయనీయమైన పరిస్థితి ఆ ఆస్పత్రిలో నెలకొని ఉందో అర్థమవుతోంది.
రెండో అంతస్తుకు తీసుకెళ్లాక అక్కడ కూడా స్ట్రెచర్ లేకపోవడంతో డాక్టర్ దగ్గరికి రోగిని ఈడ్చుకెళ్లారు. రోగిని అతని బంధువులు ఈడ్చుకొని వెళ్లే పరిస్థితి దాపురించింది. అక్కడ స్ట్రెచర్ లేకపోవడమే కాకుండా వీల్ చైర్ కూడా లేకపోవడంతో అతని బంధువులు రోగిని ఈడ్చుకెళ్లడం అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, ఈ ఘటన ఏప్రిల్ 1న జరిగినా ఇది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. రోగిని కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లడం అందరినీ కలిచివేసింది. అక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతో రోగితో పాటు అక్కడికి వచ్చిన వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.