BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై సందిగ్ధం

కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.

BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలపై సందిగ్ధం

BJP candidates Suspense

Updated On : October 21, 2023 / 11:53 PM IST

BJP First List Suspense : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా జాబితా సిద్ధమైంది. నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాను సిద్ధం చేసింది. దాదాపు 55 మంది అభ్యర్థులకు సంబంధించిన జాబితాను సిద్దం చేసింది. ఈరోజు ఉదయం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాల్సివున్నది. అయితే సిద్ధమైన తొలి జాబితాపై కొంత సందిగ్థం ఏర్పడింది.

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలపై సందిగ్ధం నెలకొంది. మొదటి జాబితాపై ఒకరిద్దరు నేతలూ అలకబూనడంతో తొలి జాబితా విడుదలను ఆపేశారు. కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.

Assembly Elections 2023: ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యేతో పాటు కీలక నేతలు రాజీనామా

వివేక్ వెంకటస్వామి – చెన్నూరు, రఘునందన్ రావు – దుబ్బాక, విజయరామారావు – స్టేషన్ ఘన్ పూర్, ఈటల రాజేందర్ – హుజురాబాద్, సంకినేని వెంకటేశ్వరరావు – సూర్యాపేట, రాణి రుద్రమదేవి -సిరిసిల్ల , బండి సంజయ్ – కరీంనగర్, బోగ శ్రావణి – జగిత్యాల, సోయం బాపూరావు- బోధ్, నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్ – కోరుట్ల, ఈటల రాజేందర్ – గజ్వేల్, పాయల్ శంకర్-ఆదిలాబాద్, ఆరెపల్లి మోహన్ – మానకొండూరు, ఎస్.కుమార్ – ధర్మపురి, ఆచారి – కల్వకుర్తి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.