రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో కలకలం రేపిన బ్యాగ్‌

రేవంత్ రెడ్డి ఇంటికి సమీపం నుంచి బ్యాగును మరో ప్రాంతానికి తరలించి..

రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో కలకలం రేపిన బ్యాగ్‌

CM Revanth Reddy

Updated On : September 15, 2024 / 4:21 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటి సమీపంలో ఓ బ్యాగ్‌ కలకలం రేపింది. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్‌ కనపడడంతో దాన్ని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి ఇంటికి సమీపం నుంచి బ్యాగును మరో ప్రాంతానికి తరలించి తనిఖీలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉన్నారు. ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మహేశ్ కుమార్ గౌడ్‌కు రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు అప్పగించారు.

ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో బ్యాగు కనపడడం గమనార్హం.

కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఏమన్నారో తెలుసా?