Police Seize Money : ఎన్నికల వేళ హైదరాబాద్ ఫిలిం నగర్‌లో కలకలం.. భారీగా నగదు స్వాధీనం
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Police Seize Money (Photo Credit : Google)
Police Seize Money : పోలింగ్ కు కొన్ని గంటల ముందు హైదరాబాద్ ఫిలింనగర్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఫిలింనగర్ లో భారీగా నగదు పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో రూ.40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ సమయంలో నగదు, బంగారం పట్టుబడింది. శనివారం సాయంత్రం సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ బాలస్వామి ఆధ్వర్యంలోని పోలీసుల బృందం చెకింగ్స్ చేస్తుండగా ఈ నగదు, బంగారం వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ నగదు, బంగారం ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.
కాగా, సరైన పత్రాలు లేకపోతే పోలీసులు కేసు నమోదు చేసి నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన డాక్యుమెంట్స్ చూపించగలిగితే పోలీసులు పట్టుబడిన డబ్బు లేదా ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తారు.
అటు.. తెలుగు రాష్ట్రాల్లో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. నాయకులు సైలెంట్ అయిపోయారు. అంతా గప్ చుప్ అయిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మే 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు కల్పించారు.
Also Read : ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు.. మూతపడ్డ మద్యం దుకాణాలు