Teenmar Mallanna Party: కొత్త రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న.. పేరు, పార్టీ జెండా ఇదే.. దానిపై మూడు నినాదాలు..
తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఏంటి? కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆయన లక్ష్యం ఏంటి.. తెలుసుకుందాం..

Teenmar Mallanna Party: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. హైదరబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేశారు మల్లన్న. సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానని తీన్మార్ మల్లన్న చెప్పారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.