Telangana Assembly Elections 2023 : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, కాగ్రెస్ నేతల ఘర్షణ.. పరస్పర ఆరోపణలు

తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. పండుగ అంటూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మరి ఓట్ల పండుగ అంటే వాడీ వేడీగా గొడవలు,తోపులాటలు,ఘర్షణలు, కేసులు వంటి హాట్ హాట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అదే కనిపిస్తోంది.

Congress Vs BRS

BRS Vs Congress : చింతమడకలో సీఎం కేసీఆర్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. పండుగ అంటూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మరి ఓట్ల పండుగ అంటే వాడీ వేడీగా గొడవలు, తోపులాటలు, ఘర్షణలు, కేసులు వంటి హాట్ హాట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అదే కనిపిస్తోంది. మూడోసారి విజయం సాధించాలని గులాబీ దళం.. గులాబీ కోటలు బద్దలు కొట్టి ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తామని కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వాడీ వేడీ వాతావరణం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొడవలతో వాతావరణం ఉద్రిక్తతగా మారింది. ఎక్కువ ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్యే ఈ గొడవ జరుగుతుంటం గమనించాల్సిన విషయం.

కామారెడ్డిలో హై టెన్షన్.. పోలింగ్ కేంద్రం వద్ద రేవంత్ సోదరుడితో బీఆర్ఎస్ నేతల ఘర్షణ

ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని.. ఆ రెండు పార్టీలు బయటకు విమర్శలు.. చాటున సహకారాలు చేసుకుంటున్నాయంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న గొడవలు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్యే జరుగుతోంది. దీంట్లో ప్రధానంగా గులాబీ బాస్ కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నా కామారెడ్డిలో గొడవలు ఘర్షణకు దారి తీశాయి. రేవంత్ రెడ్డి సోదరుడి కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొండల్ రెడ్డి వాహనాన్ని తీసుకెళ్లిపోయారని ఆయన ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో వింత డిమాండ్లతో నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!

ఇదిలా ఉంటే అచ్చంపేటలలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ తీవ్రస్థాయికి వెళ్లింది. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఖానాపూర్ లో కూడా అలాంటి గొడవే జరిగింది. ఇక జనగామలో కూడా అదే తీరు. బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జనగామలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలతో పాటు సీపీఎం,బీజేపీ నేతల హద్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా సాతాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కల్పించుకుని ఎక్కడిక్కడ గొడవల్ని సద్ధుబాటు చేస్తున్నారు. అటు అధికార పార్టీ… ఇటు అధికారంలోకి వస్తామంటున్న పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్యే ఎక్కువగా ఘర్షణలు జరుగుతుండటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు