Delhi : ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్..బీజేపీలో చేరేవారి లిస్ట్ అధిష్టానికి ఇవ్వనున్న తెలంగాణ చీఫ్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై బీజేపీ హై కమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా మరికొందరు బీజేపీలో చేరేవారి లిస్ట్ ను తీసుకెళ్లారు బండి సంజయ్.

Telangana BJP chief Bandi Sanjay went to Delhi
Delhi : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై బీజేపీ హై కమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా మరికొందరు బీజేపీలో చేరేవారి లిస్ట్ ను తీసుకెళ్లారు బండి సంజయ్. కాగా జనవరి (2023) 16-17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులను నియమించనున్నారు. తెలంగాణపై గురి పెట్టిన బీజేపీ ఈ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలను పార్టీలో చేర్చుకోవటం వంటి అంశాలను ఎజెండాగా పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా కృషి చేస్తోంది. బీజేపీ అధిష్టానానికి తెలంగాణ బీజేపీ నేతల బండి దూకుడుతో ప్రయోజనాలను చేకూరుస్తున్నారు.
BJP Govt Cabinet : మోడీ కేబినెట్‌లోకి బండి సంజయ్ .. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్
ఇదిలా ఉంటే ఏపీకి వెళ్లనని తెలంగాణలోనే కొనసాగుతానంటున్న తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో బండి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలని సోమేశ్ కుమార్ స్థానంలో కొత్త అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేటాయించిన ఎంతోమంది సీనియర్లు ఏపీకి కేటాయించిన సీఎస్ సోమేశ్ కుమార్ నే సీఎం కేసీఆర్ లబ్ది కోసమే సోమేశ్ కుమార్ ను సీఎస్ గా నియమించుకున్నారంటూ విమర్శించారు. తెలంగాణకు సీఎస్ గా సోమేశ్ కుమార్ ను తప్పించి ఏపీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.ఏపీకి వెళ్లకుంటే సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా..జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. మరి ఈ సమావేశాల్లో నడ్డాను అధ్యక్షుడిగా పొడిగిస్తారా? లేదా కొత్తవారిని నియమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. నడ్డా సారధ్యంలో బీజేపీ దూకుడుతో కొనసాగుతోంది కాబట్టి నడ్డానే అధ్యక్షుడిగా పొడిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.