Eatala Rajender
Eatala Rajender – Raj Gopal Reddy : తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉన్నా ఈటల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఆగిపోయారు. ఇద్దరు నేతలు మరికొంతమంది అగ్రనేతలను కలిసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీకి వెళ్లిన ఈటల, రాజగోపాల్ రెడ్డి.. జేపీ నడ్డా, అమిత్ షా తో సమావేశం అయ్యారు.
తెలంగాణ రాజకీయ పరిణామాలు ఢిల్లీలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ లో చేరేందుకు జూపల్లి కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఢిల్లీకి రాబోతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకులతో కీలక సమావేశంలో పాల్గొన్న ఈటల, రాజగోపాల్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ ఇంకా హస్తినలోనే ఎందుకు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ లో వెళ్లే వారికి కళ్లెం వేయబోతున్నారా? లేక వీరు కూడా అసంతృప్తులుగా మారి కాంగ్రెస్ కి వెళ్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read.. Bandi Sanjay: తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు.. ప్రజలు అనుకోవాలి
ఎందుకంటే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నారు. పార్టీ నేతలంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈటల, రాజగోపాల్ రెడ్డి సైతం నాగర్ కర్నూల్ సభలో పాల్గొంటారని.. తాము బీజేపీలోనే ఉన్నట్లుగా వారొక సంకేతం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, ఇందుకు భిన్నంగా వారిద్దరూ ఇంకా ఢిల్లీలోనే ఉండటం, జాతీయ నాయకత్వాన్ని కలిసే ప్రయత్నం చేయడం పార్టీ వర్గాల్లో డిస్కషన్ కు దారితీసింది. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఈటల, రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎందుకు ఢిల్లీలోనే ఉన్నారు? అనేది ఉత్కంఠగా మారింది.
బీఆర్ఎస్ అవినీతి పాలనపై త్వరగా చర్యలు తీసుకోవాలని జాతీయ నాయకత్వానికి క్లియర్ అల్టిమేటం ఇచ్చారు ఈటల, రాజగోపాల్ రెడ్డి. లేదంటే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని వారు చెప్పినట్లు సమాచారం.