Komati Reddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై బీజేపీ నేతల రియాక్షన్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై బీజేపీ నేతల స్పందించారు. బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని రాజగోపాల్ ఎలా అంటారు తెలంగాణ ప్రజలు మరోలా అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.

Komati Reddy Rajagopal Reddy Resignation
Komati Reddy Rajagopal Reddy Resignation : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు.
కిషన్ రెడ్డి..
ఎవరి ఆలోచనలు వారివి..ఎవరి ఇష్టం వారిది అంటూనే బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని రాజగోపాల్ అనటం సరికాదన్నారు. ఆయన అనుకుంటే సరిపోతుందా..? తెలంగాణ ప్రజల ఆలోచన మరోలా ఉందని అని అన్నారు.
జితేందర్ రెడ్డి..
జితేందర్ రెడ్డి మాట్లాడుతు..రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లైడ్ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీలోకి ఎంతోమంది నేతలు వస్తుంటారు పోతుంటారు. ఎవరు పార్టీ వీడి వెళ్లినా బీజేపీ మాత్రం ఎప్పుడు బలంగానే ఉంటుందన్నారు. పార్టీలోకి కొందరు అలా వచ్చి..ఇలా వెళ్లిపోతుంటారు వారి వల్ల లాభమూ లేదు నష్టమూ లేదన్నారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు.
లక్ష్మణ్..
పార్టీను వీడుతు రాజగోపాల్ రెడ్డి బీజేపీపై నిందలు వేయటం సరికాదన్నారు. పార్టీలోకి వచ్చిన వెంటనే రాజగోపాల్ కు బీజేపీ గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించిదని అటువంటి పార్టీని వీడటంపై ఆశ్చర్యం కలుగుతోందన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన తీర్పునిస్తారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేస్తోంది అంటూ ఆరోపించారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావటం ఖాయమన్నారు.