Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్‌ మృతితో ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

Bandi Sanjay

Bandi Sanjay’s padayatra : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్‌ మృతితో ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 24న 50వేల మందితో కలిసి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభిచాలనుకున్నారు.

భాగ్యనగర్ లక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర చేపట్టాలని ప్లాన్ చేశారు. కళ్యాణ్ సింగ్‌ మరణించండం, బీజేపీ అధిష్టానం ఈ నెల 24 వరకు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఆయన యాత్ర వాయిదా వేసుకున్నారు.

ఇప్పటికే బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రతో వాయిదా వేసుకున్నారు. కళ్యాణ్‌సింగ్ మృతితో ఇప్పుడు మరోసారి బండి సంజయ్‌ యాత్రకు బ్రేక్‌ పడింది.