హేయమైన చర్య : శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్

శ్రీలంకలో ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. బాంబు పేలుళ్లలో చాలా మంది మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఉదయం నుంచి హోటల్స్,చర్చిలు టార్గెట్ గా ఐసిస్ ఉగ్రసంస్థ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 207మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.500 మందికి పైగానే గాయపడ్డారు.