Jaggareddy : ఒకే ఒక్క లెటర్.. సైలెంట్ అయిపోయిన జగ్గన్న!
నిన్న మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్‌పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడెన్‌గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఝలక్‌తో యూ టర్న్ తీసుకున్నారు...

Congress Mla Jagga Reddy
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. బహిరంగంగానే విమర్శలు చేస్తూ.. ఆయన వార్తల్లోకి ఎక్కుతున్నారు. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. మాటల తూటాలను పేలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా వేచి చూసిన టీపీసీసీ పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతలను నుంచి తప్పించింది. తాను స్వతంత్రంగా ఉంటానని చెబుతూ జగ్గారెడ్డి గతంలో అధిష్టానానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. అంతే..ఒక్కసారిగా జగ్గారెడ్డి గరమయ్యారు. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను త్వరలోనే ఝులక్ ఇస్తానంటూ.. ఒంటికాలిపై లేచారు. అది చేస్తాను..ఇది చేస్తాను.. షోకాజ్ నోటీసు ఇచ్చి చూడండి..బండారం బయటపెడుతానంటూ ఒకస్థాయిలో ఫైర్ అయ్యారు. కానీ..ఏమైందో తెలియదు.. కానీ.. జగ్గారెడ్డి కాస్తా మెత్తబడ్డారు.
Read More : Cong MLA Jagga Reddy : రేవంత్‌కు త్వరలో ఝలక్ ఇస్తా-జగ్గారెడ్డి
నిన్న మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్‌పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడెన్‌గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన ఝలక్‌తో యూ టర్న్ తీసుకున్నారు. కోపంలో ఏదో అంటామని.. అవతలి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే వెనక్కి తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్‌లా తన పరిస్థితి మారిపోయిందన్నారు జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదని.. తనకు, రేవంత్‌రెడ్డికి మధ్య గుణగణాల పంచాయితీగా చెప్పారు జగ్గారెడ్డి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని చెప్పారు జగ్గారెడ్డి.
Read More : MLA Jagga Reddy : జగ్గారెడ్డికి హైకమాండ్ షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు
అయితే రేవంత్‌పైనా పంచ్‌లు పేల్చారు జగ్గారెడ్డి. చంద్రబాబు దగ్గర రేవంత్ రెడ్డి ఏం రాజకీయం నేర్చుకున్నాడో అని సైటెర్లు వేశారు. రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటనకు పిలవకపోవడంపై మండిపడ్డారు. అటు.. కాంగ్రెస్ రాజకీయం హస్తినకు చేరింది. పీసీసీ చీఫ్ రేవంత్‌తో పాటు వీహెచ్, భట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే.. వీరికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసిన రేవంత్.. తాజా రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. జగ్గారెడ్డి వ్యవహారం.. పార్టీ పరిస్థితుల్ని అధిష్ఠానానికి రేవంత్ వివరించినట్టు చెబుతున్నారు.