MLA Veeraiah : చంద్రబాబును కలిసిన టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య

భద్రాచలంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. తాజా వరదలతో అతలాకుతలమైన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Veeraiah

MLA Veeraiah : భద్రాచలంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. తాజా వరదలతో అతలాకుతలమైన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిపెట్టింది. టీడీపీ ఓటు బ్యాంకు, ప్రభావం ఎక్కువగా ఉండే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఖమ్మం సభకు చంద్రబాబు హాజరు కానున్నారు.

ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో ఎన్నికలు రానుండడంతో…రాష్ట్ర వ్యాప్తంగా….పార్టీ ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఖమ్మం సభ తర్వాత పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం ముంపు మండలాల్లో రెండు రోజుల పర్యటనలో భాంగా ప్రస్తుతం బాబు భద్రాచలంలో ఉన్నారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. స్థానిక సమస్యలపై చర్చించారు.

Mohan Babu Meets Chandrababu : హాట్ టాపిక్‌గా మారిన చంద్రబాబు, మోహన్ బాబు మీటింగ్.. కారణం ఏంటంటే..

పోలవరం విలీన మండలాల్లో ఇవాళ రెండోరోజు చంద్రబాబు పర్యటించారు. భద్రాచలం శ్రీరాముణ్ని దర్శించుకున్న అనంతరం ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ముంపు బాధితుల్ని పరామర్శించి వారి సమస్యలు తెలుసుకుంటారు.